అమెరికా లో హౌస్టన్, టెక్సస్ ఇండియా హౌస్ లో ఈ నెల 16వ తేదీన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్టు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ చెప్పారు. ఆంధ్రవిశ్వ విద్యాలయం హిందీ భవన్ లో జరిగిన మీడియా సమావేశం లో వైఎల్పి మాట్లాడారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నారు. సదస్సు లో ఉపాధ్యాయుల సత్కారం, ప్రారంభ సభ, ఆర్యా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ పురోభివృదికి శాశ్వత నిధి ప్రారంభ వేదిక, అమెరికా డయాస్పోరా తెలుగు కథ షష్టిపూర్తి వేదిక, సాహితీవేత్తల ప్రసంగాలు, స్వీయ కవితా పఠనం వేదిక, చర్చా వేదికలు, పుస్తకావిష్కరణలు, సరదా సాహిత్య పోటీలు… మరెన్నో ఆసక్తికరమయిన అంశాలు ఉంటాయిన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం అందచేస్తున్నట్టు చెప్పారు
అమెరికా లో హౌస్టన్, టెక్సస్ ఇండియా హౌస్ లో ఈ నెల 16వ తేదీన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
5