Apollo hospitals cancer patients ” Interducing India’s first cancer care helpline*

by vvwnews.com

దేశంలో ప్రప్రధమ క్యాన్సర్ కేర్ హెల్ప్‌లైన్‌ను  విశాఖలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ ప్రారంభించాయి. క్యాన్సర్ కు సంబంధించి  సందేహాల కోసం  24 గంటలు పని చేసే క్యాన్సర్ కేర్ హెల్ప్‌లైన్‌ 1800-203-1066కు డయల్ చేయవచ్చు. ఆరిలోవ హెల్త్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ,  డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి,అపోలో క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్,  సర్జికల్ ఆంకాలజీ,  చీఫ్ రోబోటిక్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎంపిఎస్ చంద్ర కళ్యాణ్ లు మాట్లాడారు.సకాలంలో సహాయం అందించడంలో ఇది  ఒక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్, రోగులు, వారి సంరక్షకులు తరచుగా ఎదుర్కొనే గందరగోళం, భయం,  ఒంటరితనాన్ని తొలగించే దిశగా  ముందడుగు అని వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వారికి చికిత్స మార్గాలపై స్పష్టత ఇవ్వడం నుండి వర్చువల్ సంప్రదింపులను షెడ్యూల్ చేయడం జరుగు తుందన్నారు. ఈ సేవ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో కరుణ, బలానికి ఒక ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు.  క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో తన అంకితభావాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్  పునరుద్ఘాటిస్తుందన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles