గురుద్వార్ జంక్షన్ దగ్గర ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగిందికార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్ల

by vvwnews.com

ఆగస్టు 15 తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆటో డ్రైవర్లను తీవ్రఆందోళనకు గురిచేస్తుంది.
ఆర్ టి సి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై పునరాలోచన చేయాలని, ఆటో డ్రైవర్లుకు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి కల్పించాలని , తేదీ 5-8-2025 ఉదయం 9:30 కి గురుద్వార్ జంక్షన్ దగ్గర ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది .
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్ల సంఘం వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. వామనమూర్తి మాట్లాడుతూ…
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చేసిన ప్రకటనతో ఆటో , వ్యాన్ , జీపు,కారు డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికిపై పునరాలోచన చేయాలని కోరారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిపిస్తే
ఆటో ,వ్యాన్ , జీప్ , కారు డ్రైవర్లుకు ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పెరిగిన డీజీలు ,పెట్రోలు విడిభాగాల ధరలు పెరిగి వీటితోపాటు నిత్యవసర వస్తువులు ,విద్యుత్ ఛార్జీలు పెరగటం మూలాన రోజంతా ఆటో నడిపిన పొట్ట గడవటం కష్టమవుతుందని తెలుపుతూ…
దీనిపై పునరాలోచన చేయాలని కోరారు.
ఇప్పటికే ఉబర్ , ఓలా, రాపిడో వంటి వాటి వలన ఆటో, వ్యాన్ ,కారు డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు , రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెడుతున్న ఉచిత బస్సు ఆలోచనపై మరొకసారి సమీక్షించాలని లేనిపక్షంలో నష్టపోయిన డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేయాలని, భారీగా జరీమణులు వేసిన జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రూ 1500లకు తగ్గించాలని డీజిల్ పెట్రోల్ పై జిఎస్టి పన్నులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రావి కృష్ణ , దేవుడు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles