పర్యావరణ హిత రాఖీలనే వినియోగించండి
– దేశీయ విత్తనాలతో రాఖీలు ఆరోగ్యకరం
– పర్యావరణ హితంగా జీవించండి
– మన ఆరోగ్యం మన జీవన విధానంతో ఉంటుంది
– శ్రీరంజని, స్టేట్ జెసి ఎస్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
పర్యావరణ హిత రాఖీలనే వినియోగించండి అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర జాయింట్ ఎన్విరాన్మెంటల్ చీఫ్ సైంటిస్ట్ శ్రీరంజని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖపట్నం నగరంలో మాధవధార లోని కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ కార్యాలయం లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ నేతృత్వంలో మురళి మాధవ విద్యాలయం, శ్రీ విద్యా వికాస స్కూల్ విద్యార్థులతో దేశీయ విత్తనాలతో రాఖీ లు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశీయ విత్తనాలతో రాఖీలు ఆరోగ్యకరం అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించండి అని కోరారు. ప్రకృతి ఆధారత ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలన్నారు. మన ఆరోగ్యం మన జీవన విధానంతో ముడిపడి ఉంటుందని వివరించారు.
కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద మాట్లాడుతూ విద్యార్థులలో పర్యావరణ స్పృహ ఉండాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిరంతరం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. పలు పర్యావరణ దినోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర చాలా ఉందన్నారు. విత్తన రాఖీలు తయారు చేయడం, మహా వృక్షాలకు వృక్షాబంధనం చేయడం ద్వారా సమస్త జనావళికి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్, వనమాలి సిటిజి సంస్థల అడ్మిన్లు మళ్ళ సరిత అరవల అరుణ, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ కృష్ణకుమారి, మినియేచర్స్ ఆర్టిస్ట్ రమాదేవి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు మాట్లాడారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సీడ్ రాఖీలు తయారు చేశారు
పర్యావరణ హిత రాఖీలనే వినియోగించండి- దేశీయ విత్తనాలతో రాఖీలు ఆరోగ్యకరం- పర్యావరణ హితంగా జీవించండి
9
previous post