విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించండి. ఆగస్టు 5న గురుద్వారా సీఎండీ కార్యాలయంకు ప్రజలు తరలిరండి జి వామనమూర్తి మాట్లాడుతూరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బారాలు ప్రజలపై వేయాలని దండయాత్ర చేస్తూ బయలుదేరింది. దీని వల్ల ఈ స్మార్ట్ మీటర్ల ఖరీదును వినియోగదారుల భరించాలి. సింగిల్ ఫేజ్ మీటర్ ఖరీదు రూ. 8,927, త్రీఫేస్ మీటర్ ఖరీదు రూ. 17,286 ఈ మొత్తాన్ని 93 నెలలు బిల్లితోపాటు అదనంగా చెల్లించవలసి వస్తుంది. ప్రజలు విద్యుత్తు ఎక్కువగా వాడే సమయాల్లో చార్జీలు ఎక్కువ వసూలు చేస్తారు. వేసవికాలంలో దీని భారం ప్రజలపై మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. దీని ప్రభావం బిల్లులపై పడుతుందని ఉదాహరణకు ఇప్పుడు వచ్చే బిల్లు 500 రూపాయలు అయితే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల 3000 వరకు పెరగవచ్చు. ఈ స్మార్ట్ మీటర్లన్నీ ప్రీపెయిడ్ మీటర్ అని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం బిగించడం వల్ల సెల్ఫోన్ మాదిరిగానే రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడున్న మీటర్లు ను తీసేసి ఈ స్మార్ట్ మీటర్లు ను బిగిస్తే రీఛార్జ్ పూర్తవుగానే మన ఇంటి కరెంటు ఆగిపోతుంది. వాడుకున్న బిల్లు కనుమరుగై ముందుగానే డబ్బులు చెల్లించవలసి వస్తుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఖరీదు తో పాటు దాని రిపేరుకి అయ్యే ఖర్చులు కూడా ప్రజలే భరించాలి. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు.