గర్భాశయం లోపలి పొర, అండాశయ క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు కోసం
విశాఖలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ఎండ్ ఓ చెక్ ను ప్రారంభించింది. అపోలో క్యాన్సర్ సెంటర్స్,సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజీ, చీప్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎంపిఎస్ చంద్ర కళ్యాణ్, సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి, స్త్రీ జననేంద్రియ నిపుణులు డాక్టర్ సౌధామిని బచ్చు, డాక్టర్ శ్రీదేవి మట్ట, డాక్టర్ విద్యా కొండూరి తదితరులు జ్యోతి ప్రజ్వల్వనం చేసి ప్రారంభించారు. మహిళలకు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన వారికి రిస్క్ ఆధారిత అంచనాలు, రోగనిర్ధారణ పరీక్షలు, లక్షణాల పరిశీలనను ఎండ్ ఓ చెక్ చేస్తుంది. ఆరిలోవ హెల్త్ సిటిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని సమగ్రమైన ముందస్తు క్యాన్సర్ గుర్తింపు కార్యక్రమం ఎండ్- ఓ చెక్ ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అత్యంత ప్రబలంగా ఉన్న రెండు స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అయిన గర్భాశయం లోపలి, అండాశయ క్యాన్సర్ లను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించ వచ్చున్నారు. క్యాన్సర్లలోనూ లక్షణాలు సాధారణంగా ఒకే తీరులో ఉంటాయి. కడుపు ఉబ్బరం లేదా వాపు, పొత్తికడుపు లేదా కడుపులో నొప్పి, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం లేదా తినడానికి ఇబ్బంది పడటం, తరచుగా లేదా అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మలబద్ధకం, వివరించలేని కారణాలతో బరువు తగ్గడం, అలసట, వెన్ను నొప్పి మరియు జననేంద్రియాలు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయిన్నారు. మెనోపాజ్ అనంతర కాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయిన్నారు. చాలా మంది మహిళలు తమ ఆరోగ్య తనిఖీ పరీక్షలను ఆలస్యంగా చేయించు కోవటం వల్ల ఆలస్యంగానే సమస్యలు కూడా బయట పడుతున్నాయిని తెలిపారు
Apollo 🦀 CANCER 🦀 CENTRES ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించుట
8