ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వాడబలిజలకు అగ్రతాంబూలం ఇవ్వగా ప్రస్తుత పూర్తిగా ప్రక్కనపెట్టడం

by vvwnews.com

నామినేటెడ్ పోస్టులు భర్తీలో వాడ బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలి విశాఖపట్నం జూలై 22 రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు భర్తీలో వాడబలిజ కులస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు అన్నారు.మంగళవారం ఫిషింగ్ హార్బర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వాడబలిజలకు కేటాయించగా కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియులకు కేటాయించడం సరికాదన్నారు.మత్స్యకారుల్లో 14 ఉపకులాలు ఉన్నాయని తూర్పు గోదావరి,ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాడ బలిజలు 31 శాతం మంది ఉన్నారని జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే నామినేటెడ్ పోస్టులు భర్తీలో సము
చిత ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు తొలినుండి వాడబలిజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చొరవ తీసుకొని అన్ని అర్హతలు ఉన్న తమ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి సి. అప్పారావుకు పోస్టుల భర్తీలో సముచితమైన స్థానం కల్పించాలని కోరారు.ఏపీ మెకనైజుడ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పి. సి. అప్పారావు మాట్లాడుతూ అన్నీ రంగాల్లోనూ వెనుక పడ్డ వాడబలిజలకు నామినేటెడ్ పోస్టులు భర్తీలో మొండి చెయ్యి చూపడం దురదృష్టకరమన్నారు. అగ్నికులక్షత్రియులకు అన్నీ పోస్టులు కేటాయించాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు స్పందించి తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉన్న వాడబలిజలకు తగిన గౌరవం కల్పించాలని అన్యాయం జరగకుండా చూడాలన్నారు. వాడ బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కోస్టల్ మెకనైజ్డ్
ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్రి కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వాడబలిజలకు అగ్రతాంబూలం ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ప్రక్కన పెట్టడం దురదృష్టకరమన్నారు. అన్నీ రంగాల్లోనూ వెనుకబడ్డ వాడబలిజలను గుర్తించి అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు,జి. పరశురాముడు,మున్నం బాలాజీ, జి.కామేశ్వరరావు, ఎం ఆనంద్,ఆర్ సత్యనారాయణ, జి.రాజు,,జి. అప్పడు, జి. గరగయ్య, జి. రాజేష్,కె. చిన్న, వి. యల్లారావు, ఎం. మెసేన్, ఎం. రాజ్ కుమార్, కుంజుమన్ తదితరులు పాల్గొన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles