ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సూత్ర 19th & 20th సూత్రా విశాఖనగరానికి పండుగ వాతావరణం తీసుకు వచ్చింది

by vvwnews.com

ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సూత్ర
విశాఖపట్నం 19 జూలై 2025 : సూత్రా విశాఖనగరానికి పండుగ వాతావరణం తీసుకు వచ్చింది. విశాఖపట్నం లోని సుందర తీరమైన RK బీచ్ వద్ద నున్న నోవాటేల్ హోటల్ నందు ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ సూత్ర శ్రావణ మాసం మరియు రాఖీ సందర్భంగా ప్రత్యేక వస్త్ర ప్రదర్శన జూలై 19 మరియు 20 తేదీలలో ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలు వరకు ఉంటుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం ఈ ప్రదర్శనలో షాపింగ్ చేయటం ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు చెపుతున్నారు.

అద్బుతమైన విశిష్ట వస్త్రాల సమ్మిళితమైన సూత్ర ప్రదర్శన ప్రసిద్ది చెందినది. భారతదేశం లోని ప్రముఖ ప్రీమియం బ్రాండ్ల ఎగ్జిబిషన్. సంప్రదాయతలో అత్యున్నత ఫ్యాషన్ లను మిళితం చేసిన చేనేతలు సూత్ర ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా నున్న 50 పైగా ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ ఉత్తమ శ్రేణి ఉత్పత్తులను, ఉపకరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నింటిని ఒకేచోట ఈ ప్రదర్శనలో మీకు అందిస్తారు. మీరు పండుగలు శుభ కార్యాల కోసం వస్త్రాలు, సౌందర్య సాధనాలు మరియు అద్బుతమైన కానుకలు కోసం చూస్తుంటే అవన్నీ సూత్రా లో మీకు లభిస్తాయని నిర్వాహకులు చెపుతున్నారు.
సూత్రా ప్రదర్శనలో ఇంపీరియల్ తారా, R లక్ష హ్యామ్పార్, లేబుల్ ఇషానా, ఊష్వీ, రాజ్ రూపికాస్, క్రియాన్ ఫ్యాషన్స్, మొదలైన వారు పాల్గోవటం జరిగినది. ఇందులో సంప్రదాట నుండి ఆధునిక శైలి వరకు అద్భుతమైన వస్త్రాలు, హేండ్ క్రాఫ్ట్స్ ఆభరణములు, లేహంగాలు, ఇండి-వెస్ట్రన్ ఫ్యాషన్లు, ఎత్నిక్ ఫుట్ వేర్, లగ్జరీ గిఫ్ట్ అయిటంలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. మీ ప్రతి వేడుకను మరింత శోభాయమానం చేస్తాయి.

సూత్రా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఒక గొప్ప మధురానుభుతిని కలిగించే చక్కని షాపింగ్ ప్రదేశం. ఇక్కడ మీకు విభిన్నమైన విశిష్ట వస్త్రాలతో పాటు అనేక రకాల వస్తు సముదాయం ఆకర్షణీయమైన ధరలు మరియు తగ్గింపు ధరలు తోపాటు మంచి ఆఫర్లతో లభిస్తాయని నిర్వాహకులు చెపుతున్నారు.
📞 సంప్రదించండి: 99035 18813

Use Social Media to Spread the Word about Our News

related articles