సమస్త ఒక్క భూగోళం మీదే జీవరాశి ఉంది.
– ఏ జీవి మృత్యువాత పడిన నష్టం మానవాళికే
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో
సమస్త జీవరాశితోభూగోళం కళకళలాడాలి అని
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ రామకృష్ణ ఆధ్వర్యంలో, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నేతృత్వంలో బుధవారం ఉదయం పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విశ్వంలో ఒక్క భూగోళం మీదే జీవరాశి ఉందని ఆ జీవరాసుని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదెనని పేర్కొన్నారు. భూమి మీద ఏ జీవి మృత్యువాత పడినా నష్టం మానవాళికే అని హెచ్చరించారు. సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు దేశీయ విత్తనాలు సేకరిద్దాం, సామాజిక వనాలు పెంచుదాం అని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడారు. అలాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ అందజేసిన గుడ్డ సంచులు పంపిణీ చేశారు.
సమస్త ఒక్క భూగోళం మీదే జీవరాశి ఉంది.ఏ జీవి మృత్యువాత పడిన నష్టం మానవాళికే.
35